TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెప్ప‌గానే వింటే జ‌గ‌న్ ఎందుకవుతాడు లోకేష్‌!

Published on: Wed Jul 13, 2022 11:56AM

క్లాసులో అల్ల‌రి మానండి, శ్ర‌ద్ధ‌గా వినండి.. ఇలాంటివి ప్ర‌తీ ఒక్క‌రికీ పాఠ‌శాల జీవితంలో అనుభవమే. టీచ‌ర్లు హెచ్చ‌రించ‌డం, మంచి మార్కులు రాగానే శ‌భాష్ అన‌డం సహజమే.  ఇప్పుడూ వుంది ఆ సంప్ర‌దాయం. కానీ జ‌గ‌న్ ఏమ‌న్నా స్కూలు పిల్లాడా?   పాపం నారా లోకేష్  అరాచ‌కాలు, క‌బ్జాలూ మానుకోమ‌ని  చెప్ప‌గానే  విన‌డానికి  ఆయ‌నేమ‌న్నా చిన్న పిల్లా డా, వెంట‌నే వినేస్తాడా? ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ  అధినేత‌. ఆయ‌నే రాజు,  ఆయనే మంత్రి. చెప్ప‌గానే ఓకే అనేసి మానుకోవ‌డానికి అవేమ‌న్నా చిన్నా చిత‌కా ప‌నులా!  భూక‌బ్జాలు, దాడులు, అరాచ‌కాలు. అవి వారికి స‌హ‌జ‌సిద్ధంగా అబ్బిన  విద్య  అన్న‌ది అనేక సంద‌ర్భాల్లో  విప‌క్షాలు విమర్శల ద్వారా తేటతెల్లం చేశాయి కూడా. తెలుగుదేశం  నేత నారా లోకేష్ ట్విట‌ర్ వేదిక‌గా జ‌గ‌న్ తీరును ఎండ‌గ‌ట్టారు.

 ఓటు వేయ‌క పోతే వేటు వేయ‌డం వైసీపీ న‌యా ఫ్యాక్ష‌న్ ప్ర‌జాస్వామ్యమ‌ని వ్యాఖ్యానించారు. ప్రజలు తిరగబడక ముందే కబ్జాలు, అరాచకాలు మానండి అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ముఖ్యమంత్రిని హెచ్చరించారు.  ఎన్నికలై చాలా రోజులైనా టీడీపీకి  ఓట్లు వేశారనే  కక్షతో ప్రకాశం జిల్లా గానుకపెంటలో మర్రి  శ్రీను  అనే  మేకల కాపరి ఇంటినే కబ్జా చేశారు.

ఇంకెన్నాళ్లు  మీ  అరాచకాలు జగన్‌రెడ్డి గారూ  అంటూ లోకేశ్‌ ప్రశ్నించారు. మ‌రో వంక టీడీపీ ఎమ్మెల్సీ అంగ‌ర రామ్మోహ‌న‌రావు  జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం పై మండిప‌డ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ తీరు జేబు దొంగ‌ల‌కంటే  దారుణమ‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

 మంగళవారం ఆయన  టీడీపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించే ప్రతిసారీ పేదల ఇళ్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పడమే తప్ప చేస్తున్నదేమీ లేదన్నారు. మూడేళ్ల లో నాలుగు శాతం ఇళ్లనే పూర్తి చేశారని ఎద్దేవా చేశారు.  ఆ ఇళ్ల స్థలాల చదును పేరుతో  వైసీపీ నాయకులు, కార్యకర్తలకు రూ. 7వేల కోట్లు దోచిపెట్టారని  ఆరోపించారు. ఇదిలా వుండ‌గా, వైసీపీ అధికారంలోకి  వచ్చినప్పటి నుంచి సీఐడీ పోలీసులు చట్టపరమైన బాధ్యతలను  మరిచిపోయి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వ్యక్తిగత సైన్యంలా పని చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు డు వర్ల రామయ్య విమర్శించారు. సీఐడీ తన విధులను రాజ్యాంగం ప్రకారం, ఏపీ పోలీసు మాన్యువల్‌లో నిర్దేశించిన ప్రకారం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐడీ ఏడీజీకి మంగళవారం ఆయన లేఖ రాశారు.