టీజీ టీడీపీని వీడుతారా..?

 

తాజాగా కర్నూలు ఉస్మానియా కళాశాలలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మంత్రి లోకేష్‌ అనూహ్యంగా.. కర్నూలు పార్లమెంట్ మరియు కర్నూలు అసెంబ్లీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు.. రాబోయే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఉంటాయి.. ఒక ఓటు మోహన్‌రెడ్డికి.. మరో ఓటు బుట్టా రేణుకకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.. మోహన్‌రెడ్డిని శాసనభకు, బుట్టా రేణుకను లోక్‌సభకు పంపే బాధ్యత మీదే అని లోకేష్ అన్నారు.. ఇప్పుడిదే కర్నూల్ రాజకీయాల్లో చర్చకు తెరదీసింది.. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ విషయంపై టీడీపీలో చాలా గందరగోళం ఉంది..

2014లో ఈ స్థానం నుంచి టీడీపీ తరపున టీజీ వెంకటేశ్ పోటీ చేసి ఓడిపోయారు.. తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు.. ఇప్పుడా అసెంబ్లీ సీటు నుంచి తన కుమారుడు టీజీ భరత్‌ను నిలబెట్టాలనుకుంటున్నారు.. కానీ వైసీపీ తరపున గెలిచిన.. ఎస్వీ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.. అప్పటి నుంచి కర్నూలు టీడీపీలో వర్గపోరు ప్రారంభమైంది.. రెండు వర్గాలు తమకే టిక్కెటన్న నమ్మకంతో ఉన్నాయి.. లోకేష్ రాక సందర్బంగా రెండు వర్గాలు బలప్రదర్శన కూడా చేశాయి.. బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి.. అయితే మంత్రి లోకేష్‌ అభ్యర్థులను బహిరంగంగా ప్రకటించడంతో టీజీ వర్గం ఒక్కసారిగా డీలా పడింది.. టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది.. ఎస్వీ మోహన్ రెడ్డికి రూట్ క్లియర్ చేయాడానికేనన్న ప్రచారం మొదట్లో సాగింది.

అయితే కర్నూలు స్థానాన్ని ఎట్టి పరిస్థితు ల్లోనూ వదులుకోనని, తన తనయుడు టీజీ భరత్‌ బరిలో ఉంటాడని ఎంపీ టీజీ తన సన్నిహితులతో చెబుతూ వచ్చారు.. మరి లోకేష్ తాజా ప్రకటనతో టీజీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ మొదలైంది.. తనయుడి భవిష్యత్తు కోసం టీడీపీని వీడతారు అనే భావన కూడా వ్యక్తమవుతోంది.. చూద్దాం ఏం జగురుతుందో.