పవన్ కు లోకేశ్ కౌంటర్...

 

పవన్ కళ్యా ణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సమావేశంలో మాట్లాడిన లోకేశ్... తన తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబుల మాదిరి తాను మంచి పేరు తీసుకురాకపోయినా... వారికి చెడ్డ పేరు మాత్రం తీసుకురానని అన్నారు. వారి ఆశయాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ఎన్ని ఒడిదొడుకులనైనా తట్టుకునే స్థైర్యం చంద్రబాబుకు ఉందని... 'వస్తున్నా మీ కోసం' యాత్ర ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేశారని తెలిపారు. నిరంతరం ప్రజల కోసమే తపిస్తుంటారని... కుటుంబం కోసం కూడా ఏనాడూ ఆలోచించలేదని చెప్పారు. కాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్ లోకేశ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. లోకేశ్ అవినీతి గురించి మీకు తెలుసా అని.. లోకేశ్ వల్ల ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని విమర్సించిన సంగతి కూడా విదితమే.