TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోక్ సభకు ముందస్తు ఎన్నికలు తప్పవా?

Published on: Tue May 15, 2012 9:39AM

ఇక వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని ఒకవైపు భారతీయజనతాపార్టీ, మరోవైపు పశ్చిమ బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు తమ కార్యకర్తలను ఆ ఎన్నికల పేరిట ప్రచారానికి సన్నద్ధం చేస్తున్నాయి. భారతీయజనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు నితీష్ గడ్కారీ, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తమ పార్టీ సమావేశాలను నిర్వహించి ఈ మేరకు సిద్ధంగా ఉండమని కార్యకర్తలను కోరారు.

 

 

ఇటీవల మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బిజెపి నాయకులు కూడా ఇదే తరహా సంకేతాలను పంపించారు. లోక్ సభ మాజీ సభ్యుడు చెన్నమనేని విద్యాసాగరరావు ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పర్యటిస్తూ ముందు అసెంబ్లీ, తరువాత లోక్ సభ ఎన్నికల్లో తమకు సహకరించాలని నేరుగా ఓటర్లనే కోరారు. 2013లో ఈ ఎన్నికల కోసం తమ పార్టీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన సుబ్రతాభక్షికి మమతా అధికారం అప్పగించారు. అంతేకాకుండా ప్రజాసంక్షేమం కోసం పనిచేయని ఎంపీలు, ఎమ్మెల్యేలు అసలు తమకు అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. దేశరాజకీయాల్లో బిజెపి ఇంకా చురుకైన పాత్రను పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధమైతే గెలుపు ఖాయమని ఆయన మదురైలో చెప్పారు.