TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉభయ సభలూ సోమవారానికి వాయిదా

Published on: Fri Aug 31, 2012 2:25PM

శుక్రవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్ష సభ్యులు ప్రశ్నోత్తర సమయాన్ని అడ్డుకుని కోల్ స్కామ్‌పై చర్చకు పట్టుపట్టారు. బొగ్గు కుంభకోణానికి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవికి రాజీనామా చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం లోక్‌సభ తిరిగి ప్రారంభంకాగానే సభ్యులు తమ పట్టును వీడలేదు. బీజేపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్ళి నిరసన తెలియజేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను సోమవారం నాటికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే అంశంపై గందరగోళం నెలకొనడంతో సభను సోమవారం నాటికి వాయిదా వేశారు.