TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలోని ఆ జిల్లా కేంద్రంలో వారం రోజుల పాటు లాక్ డౌన్ 

Published on: Thu Jul 30, 2020 9:49AM

ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటి పోయిన సంగతి తెలిసిందే. కొన్ని జిల్లాలలో ప్రతి రోజు ఏకంగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో తాజాగా కృష్లా జిల్లా కేంద్రం అయిన మచిలీపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, ఏపీ మంత్రి అయిన పేర్ని నాని ప్రకటించారు. వచ్చే ఆగస్టు 3 నుంచి 9 వరకు వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించినట్టుగా అయన తెలిపారు. 

దీనికి సంబంధించి వైద్య, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులతో మంత్రి పేర్ని నాని సమీక్ష నిర్వహించారు. మచిలీపట్నంలో కరోనా కేసుల వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుండటంతో తప్పని పరిస్థితుల్లోనే లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు అయన తెలిపారు. ఈ వారం రోజుల పాటు మచిలీపట్నానికి రాకపోకలు ఉండవని, బస్సులు, ఆటోలు కూడా తిరగవని మంత్రి పేర్ని నాని స్పష్టంగా తెలిపారు. ఎవరైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటే వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లవచ్చని అయన వివరించారు. నిత్యావసర సరుకుల కోసం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇవ్వనున్నామని.. మిగతా షాపులకు మాత్రం ఎటువంటి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే ప్రభుత్వం ఈ లాక్‌డౌన్ పెడుతున్నామని.. దీనికి ప్రజలంతా సహకరించాలని అయన కోరారు.