TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లాక్‌డౌన్ పొడిగింపు.. స‌మ‌యం కాస్త స‌డ‌లింపు.. ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..?

Published on: Sun May 30, 2021 6:29PM

అంతా అనుకున్న‌ట్టే అయింది. తెలంగాణ‌లో లాక్‌డౌన్‌ను మ‌రోసారి పొడిగించారు. కేసుల తీవ్ర‌తను దృష్టిలో పెట్టుకొని.. మ‌రో ప‌ది రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ.. కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే.. లాక్‌డౌన్ టైమ్‌ను మాత్రం కాస్త స‌డ‌లించారు. 

ప్ర‌స్తుతం ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ స‌డ‌లింపు ఉంది. ఈ వేళ‌ల‌ను కాస్త పెంచారు. ఇక‌పై ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు లాక్‌డౌన్ స‌డ‌లింపున‌కు మంత్రి వ‌ర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్నారు. ఆ స‌మ‌యంలో మ‌రింత క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని మంత్రివ‌ర్గం పోలీసుల‌ను ఆదేశించింది.