ఎల్.కె.అద్వానీకి అస్వస్థత
Published on: Tue Aug 6, 2024 4:24PM
కాకలు తిరిగిన రాజకీయవేత్త, బీజేపీ నాయకుడు, మాజీ ఉప ప్రధాని, భారతరత్న ఎల్.కె.అద్వానీ అస్వస్థతకి గురయ్యారు. 96 సంవత్సరాల వయసు వున్న అద్వానీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు తీవ్రం కావడంతో మంగళవారం ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు బంధువర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. జూన్ నెలాఖరులో కూడా అద్వానీ అస్వస్థతకు గురికావడంతో ఎయిమ్స్.లో చేర్చారు. ఆయనకు యూరాలజీ చికిత్స అందించారు. అనంతరం జులై మొదటివారంలో ఆయన మరోసారి అనారోగ్యానికి గురవడంతో అపోలో ఆసుపత్రిలో రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన్ని ఆస్పత్రిలో చేర్చారు.


