బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీకి షాక్...
Published on: Mon Mar 6, 2017 2:31PM

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దోషులుగా ఉన్న అద్వానీ, వినయ్ కతియార్, కల్యాణ్ సింగ్ లను నిర్దోషులుగా తేల్చుతూ.. అలహాబాదు హైకోర్టు తీర్పు నిచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు జారీ చేసింది. ‘‘కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ అద్వానీపై కేసు ఎత్తివేయడం ఆమోదయోగ్యం కాదని.. ఈకేసులో నిందితులుగా ఉన్న 13మందిపై సీబీఐ అనుబంధ ఛార్జిషీట్‌ను సమర్పించవచ్చుని.. దీనిపై ట్రయల్ కోర్టును సంయుక్త విచారణ నిర్వహించమని కోరతాం’’ అని కోర్టు తెలిపింది. దీంతో కూల్చివేతలో అద్వానీపై ఉన్న కుట్ర కేసును పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 22న సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు దీనిపై స్పష్టత తీసుకురానున్నది. కాగా 1992, డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసిన విషయం తెలిసిందే.


