TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆహారంలో బల్లి... విద్యార్థులకు అస్వస్థత...

Published on: Wed Aug 13, 2014 5:56PM

 

కడప జిల్లాలోని ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లి పడింది. ఆ ఆహారం తిన్న 40 మంది విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారు. కడప జిల్లా పుల్లంపేట మండలంలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజనం చేసిన 40 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. అనుమానం వచ్చిన స్కూలు సిబ్బంది ఆహారాన్ని పరిశీలించగా, ఆహారంలో చచ్చిన బల్లి కనిపించింది. దాంతో విద్యార్థులను రాజంపేటలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ విద్యార్థులకు ప్రథమ చికిత్స చేయడంతో కోలుకున్నారు.