TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి వెంకటరెడ్డికి మద్యం సిండికేట్లలో వాటాలు?

Published on: Fri Jun 15, 2012 9:16AM

ఖమ్మంజిల్లాకు చెందిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి మద్యం సిండికేట్లతో లావాదేవీలున్నాయని తెలుస్తోంది. ఆయన బంధువులు కూడా సిండికేటు వాటాదారులని వెల్లడైంది. అయితే తన పేరు బయటికి రాకుండా వెంకటరెడ్డి తగిన జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను ఏసీబీ సేకరించిందని వెలుగులోకి వచ్చింది. ఇటీవల లిక్కర్ సిండికేట్ బాలరాజ్ గౌడ్ ను ఎసిబి పిలిపించింది. అప్పుడు తన వాంగ్మూలాన్ని ఇస్తూ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి మద్యం సిండికేట్లతో ఉన్న సమాచారాన్ని కక్కారు. మంత్రి బంధువుల పేర్లు, వారి షాపుల వివరాలు కూడా గౌడ్ వెల్లడించారని తెలిసింది. ఇప్పటికే పలువురు రాజకీయనాయకుల జాబితాలు తోకచాంతాడంత పెరిగిపోయాయనుకుంటే బాలరాజ్ గౌడ్ మరో పెద్ద తిమింగలాన్ని ఎసిబి ముందు పెట్టినట్లు అయింది. అయితే విచారణలో తాను పరారైనప్పుడు జార్ఖండ్ సిఎం, బీహార్ డిజిపి వంటి ప్రముఖుల దగ్గర తలదాచుకున్నానని బాలరాజ్ గౌడ్ చెప్పాడు. అయితే ఎసిబి ఇంకా కొందరి పేర్ల సమాచారం తెలిసినా ప్రకటించలేదనీ, వారు తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదనే గోప్యంగా ఉంచిందనీ బాలరాజ్ గౌడ్ వాంగ్మూలం తరువాత తెలిసింది.