TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మద్యం సిండికేట్ వ్యాపారుల ఇళ్లపై ఎసిబి దాడులు

Published on: Wed Jun 6, 2012 12:44PM

మద్యం సిండికేట్ వ్యాపారులపై ఎసిబి కొరడా ఝులిపిస్తోంది. నిన్న రాత్రి నుంచి ఆకస్మాత్తుగా పలు జిల్లాలలో మద్యం వ్యాపారులపై దాడులు చేసిన ఎసిబి పలువురుని తమ అదుపులోకి తీసుకుంది.మెదక్ జిల్లా మద్యం వ్యాపారి కరుణాకర్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకొని అతనిని హైదరాబాదుకు తరలించింది. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో నలుగురు, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరిని మద్యం వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కోదాడలో మద్యం సిండికేటు కార్యాలయం అకౌంటెంట్ నాగేశ్వర రావును అదుపులోకి తీసుకున్నారు. ఇతనిని కూడా హైదరాబాదుకు తరలించారు. మెదక్‌లో అదుపులోకి తీసుకున్న కరుణాకర్ రెడ్డికి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో బినామీ పేర్ల మీద మద్యం షాపులు ఉన్నట్లుగా ఎసిబి గుర్తించినట్లుగా తెలుస్తోంది.