Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కావలసింది దొరకదు.. ఇచ్చిందే తాగెళ్లు!
posted on: Jun 20, 2022 3:40PM
కాస్తంత రిలాక్సేషన్ కోసం మందు తాగడం అలవాటయినవారు మందుషాపులను ఆశ్రయించకపోరు. సాధారణంగా అలవాటయిన బ్రాండ్‌నే తీసుకోవాలని ఇష్టపడతారు. డబ్బులు మనవి, తాగేది మనం బ్రాండ్ దుకాణం వాడు నిర్ణయిస్తే ఎలా సిద్ధప్పా!? ఇపుడీ ప్రశ్నే ఆంధ్రప్రదేశ్‌లో చాలా జిల్లాల్లో మందుబాబులు వేస్తున్నారు.
దీనికి సమాధానమే దొరకడం లేదు. ఎందుకంటే దుకాణం వరకూ వెళ్లడమే అక్కడికి వెళ్లాక దుకాణదారుడు ఏ బ్రాండ్ అమ్మితే అదే కొనుక్కోవాలి. అలా వారి చ్చిందే తాగితే కిక్కేది? కానీ తప్పడం లేదు. ఈ పూటకి సద్దుకుపోదాం బ్రో అని ఠక్కున మింగి ఇవతల పడుతున్నారు. కొందరైతే ఇదెక్కడి అన్యాయం అని గొడవకీ దిగుతున్నారట!
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో మందుబాబులకు మద్యం దుకాణాలవారు చుక్కలు చూపిస్తున్నారు. హుషా రుగా వెళ్లినవారికి నువ్వడిగింది నా దగ్గర లేదు, నేనిచ్చిందీ నీకు నచ్చి తాగాల్సిందే అని డబ్బులు తీసు కుని మరీ ప్రేమగా చెబుతున్నారు. గత రెండు వారాలుగా ప్రధానంగా ఏపీలో చిత్తూరు నుంచి అనంతపురం జిల్లా వరకూ ఇదే పరిస్థితి.
కారణమేమిటని కిక్కెక్కని బ్రో ఒక దుకాణం వాడిని అడి గితే, అసలు దుకాణాల్లో మందు నిల్వలు పడి పోయాయని చెప్పాడట. పట్టణాల్లో వారి పరిస్థితి కంటే గ్రామాల్లో వారి పరిస్థితి మరీ దారుణం. గ్రామాల్లో చీప్ లిక్కర్ తప్ప మరే బ్రాండ్ లభించడం లేదు. ప్రభుత్వ దుకాణాలకు వెళితే వాళ్లు ఇచ్చినదే తాగి పొమ్మంటున్నారు. మనసు రాయి చేసుకుని ఇచ్చిందే తాగుతున్నారు మందుబాబులు ఒకరకొకరు కష్టా లు చెప్పకుంటూ!



.webp)


