బావిలో పడ్డ సింహాన్ని కాపాడారు...

posted on: Nov 3, 2014 4:08PM

 

ఓ తెలివైన కుందేలు సింహాన్ని బావిలోకి చూడమని చెప్పడం, బావిలో తన ప్రతిరూపాన్ని చూసిన సింహం బావిలో దూకేయడం... ఈ కథ అందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ స్టోరీలో కుందేలు అయితే లేదుగానీ, ఒక సింహం బావిలో పడిపోయింది. ఈ లేటెస్ట్ కథలో ట్విస్ట్ ఏమిటంటే, అటవీ శాఖ అధికారులు ఆ సింహాన్ని కాపాడారు. వివరాల్లోకి వెళ్తే, గుజరాత్‌లోని జునాగఢ్ నగర సమీపంలోని అమరాపూర్ అనే గ్రామంలో 60 అడుగుల లోతు వున్న ఓ వ్యవసాయ బావిలో అడవిలోంచి బయటకి వచ్చిన ఓ సింహం పడిపోయింది. ఆ సింహాన్ని గమనించిన గ్రామస్థులు అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు వెంటనే బావి దగ్గరకి చేరుకుని సింహాన్ని తాళ్ళ సహాయంతో సురక్షితంగా బయటకి తీశారు. ఈ సింహం వయసు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు వుంటుందని తెలుస్తోంది. ఈ సింహాన్ని ఆ తర్వాత సురక్షితంగా అడవిలో వదిలేశారు. కొంపతీసి ఈ సింహాన్ని కూడా ఏ తెలివైన కుందేలో బావిలో పడేలా చేయలేదు కదా...!

google-ad-img
    Related Sigment News
    • Loading...