బొత్సను దెబ్బ తీయడానికే దాడులు ?
Published on: Sun Dec 18, 2011 7:58AM
హైదరాబాద్:
ఇటీవల మద్యం సిండికేట్లపై పెద్ద యెత్తున దాడులు జరిగాయి. ఎసిబి దాడులతో అవినీతి రాజకీయ నాయకుల డొంక కదులుతోందని ఓ వార్త పత్రిక వ్యాఖ్యానించింది.తనపైకి దూకుడుగా వస్తున్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను దెబ్బ తీయడానికే మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ దాడులు జరిగినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేశారని ఓ పత్రిక అభిప్రాయపడింది.బొత్స సత్యనారాయణ ఐదు జిల్లాల్లో హవా కొనసాగిస్తున్నారని, లిక్కర్ సిండికేట్లను దెబ్బ తీయడం ద్వారా బొత్స సత్యనారాయణను రాజకీయంగా బలహీన పరచవచ్చునని కిరణ్ కుమార్ రెడ్డి భావించినందువల్లనే ఎసిబి దాడులు జరిగాయని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ తెలుగు టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. పక్కా ప్లాన్ ప్రకారమే మద్యం సిండికేట్లుపై దాడులు జరిగినట్లు భావిస్తున్నారు.
కోట్ల రూపాయలలో శాసనసభ్యులకు ముడుపులు ముడుతున్నాయని కూడా ఆరోపించింది. రిపోర్టర్లకు కూడా ఇందులో వాటా ఉన్నట్లు తెలిపింది. గుంటూరు జిల్లా మద్యం సిండికేట్‌లో మంత్రి మోపిదేవి వెంకటరమణ పాత్ర ఉందని తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాద రావు ఆరోపించారు. పార్టీలకు అతీతంగా శానససభ్యులు కుమ్మక్కయి మద్యం సిండికేట్లను నడిపిస్తున్నట్లు కూడా ఆరోపించింది.


