బొత్స'మద్యం మాఫియాను'సమర్థిస్తున్నారు
Published on: Thu Jan 5, 2012 11:29AM
విజయవా
డ: మద్యం తాగే వారిదే తప్పని, అమ్మే వారిది తప్పు కాదని ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడే మాటేనా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు .బొత్స మాటలు బరితెగించి మాట్లాడినట్లున్నాయని అయన అన్నారు. ఇలాంటి వారు ప్రభుత్వంలో ఉండటం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నారాయణ కృష్ణా జిల్లాలో కల్తీసారా బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.మద్యం మాఫియాను సమర్థించే విధంగా బొత్స వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఆయన మద్యం వ్యాపారంలో ఉన్నాడు కాబట్టే వ్యాపారస్తులకు అనుకూలంగా మాట్లాడారన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే మైలవరం ఘటన వెనుక ఏ పార్టీ హస్తం ఉందో బయట పెట్టాలన్నారు. కల్తీ సారా ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


