TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శూద్రపూజలంటూ.. యువతిని నగ్నంగా చేసి.. 

Published on: Fri Jun 11, 2021 3:50PM

శాస్రం, సైన్స్ ఎప్పుడు పోటీ పడుతుంటాయి. మన దేశంలో సైన్సు కంటే శాస్త్రాన్ని నమ్మేవాళ్లు ఎక్కువ బహుశా అందుకే మన దేశం ఇంకా ఇంత వెనకపడడానికి కారణం కావచ్చు. మన దేశంలో ఎదుటి వాడి బలహీనతే మరొకడి బలం.. కొంత మంది ప్రజల నమ్మకమే ఇంకొంత మంది పెట్టుబడి. ఇంకో మాటలో చెప్పాలంటే మూఢనమ్మకాలను, శూద్రపూజలు మన దేశంలో పెట్టునది లేని వ్యాపారం.. ఎందరో ప్రజల మూఢనమ్మకాలను  కొంతమంది కేటుగాళ్లు సొమ్ము  చేసుకొంటున్నారు.  క్షుద్ర పూజల పేరిట ప్రజలను నమ్మించి, యేమరిచి  నిలువునా దోచేస్తున్నారు. అదే శునకానందమో అర్థం కాదుగానీ.. శూద్ర పూజలు అనగానే బ్లు ఫిలిమ్స్ ని తలపిస్తాయి చాలా చోట్ల. ఈ మధ్య కాలంలో ఈ వార్తలు చాలా విన్నాం.. చూస్తున్నాం.. తాజాగా క్షుద్ర పూజల పేరిట ఓ యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేస్తూ వీడియోలు తీసి, ఆమెను బెదిరించి డబ్బు గుంజుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే. 

అది గుంటూరు నగరం. శారదానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు దంపతులు. వారి పేర్లు వినుకొండ సుబ్బారావు, వినుకొండ శివపార్వతిలు వాళ్ళు తరుచుగా క్షుద్ర పూజలు నిర్వహిస్తుంటారు. తాంత్రిక శక్తులను పోగొడతామని, చేతబడులు పోగొడుతామని, ప్రజలను నమ్మించడం.. ఏదో ఒకటి చెయ్యడం.. ఒక రకంగా మసిపూసి మారేడు కాయను చేయడం లాంటివి చేసి ప్రజల నుంచి డబ్బు దండుకోవడం వల్ల పని. ఈ నేపథ్యంలోనే గూడూరు మండలానికి చెందిన ఓ యువతికి ఎవరో తాంత్రిక పూజలు జరిపారని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో.. దానికి  పూజలు చేసి నయం చేస్తామని నమ్మించారు. ఇక ఇదంతా నిజమేంనని నమ్మిన తల్లిదండ్రులు కూతుర్ని వారి వద్దకు పంపారు. ఇక అంటే వాళ్ళు రంగ ప్రవేశం కాదు ఏకంగా పరకాయ ప్రవేశం చేశారు.. అనంతరం  యువతిని అర్ధనగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేస్తూ వీడియోలు చిత్రీకరించారు. తర్వాత ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని యువతి తల్లిదండ్రులను బెదిరించడం ప్రారంభించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను నిఘా వేసి పట్టుకున్నారు. మాయలు మంత్రాలూ తెలుసని, మంత్రాలతో రోగాలు నయం చేస్తామని ఎవరైనా మాయమాటలు చెప్తే నమ్మవద్దని ప్రజలకు, పోలీసులు సూచించారు.