హైదరాబాద్‌లో చిరు జల్లులు...చల్లబడిన వాతావరణం

posted on: Feb 23, 2026 3:44PM

 

ఎండలతో అల్లాడుతున్న హైదరాబాద్ ప్రజలకు ఉపశమనం లభించింది. ఇవాళ మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మాసబ్‌ట్యాంక్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో చిరు జల్లులతో వర్షం కురిసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కపోతలతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. 

కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక జోన్ల వారీగా చూసుకుంటే.. జోన్ 1లో ఉన్న యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చెదురుమదురు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దీని ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో అల్లూరి జిల్లా పాడేరులో భారీ వర్షం కురిసింది. అటు తెలంగాణలోని సంగారెడ్డిలో వడగండ్ల వాన కురిసింది. అకాల వర్షానికి జనజీవనం స్తంభించింది

google-ad-img
    Related Sigment News
    • Loading...