TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైరు తెగి కిందపడ్డ లిఫ్ట్.. ముగ్గురు మృతి

Published on: Sat Mar 18, 2023 12:07PM

ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. వీటీపీఎస్ లో లిఫ్ట్ వైర్ తెగి కిందపడటంతో ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.

విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో వైరు తెగి లిఫ్ట్ కింద పడిపోయింది. సంఘటన జరిగిన సమయంలో లిఫ్ట్ లో ఎనిమిది మంది ఉన్నారు.

ముగ్గురు మరణించగా, మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు.   సమాచారం అందుకున్న వీటీపీఎస్‌ సిబ్బంది, కార్మికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.