శ్రీశైలంలో చిరుత కలకలం
Published on: Fri Jan 2, 2026 1:42PM
.webp)
శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపింది. పాతాళ గంగ మెట్ల మార్గంలోని ఓ ఇంటి ముందు భాగంగా గురువారం (జనవరి 1) అర్ధరాత్రి చిరుత పులి సంచారం సీసీ కెమేరాల్లో రికార్డ్ అయ్యింది. అంతే కాకుండా ఆ ఇంటి యజమాని కూడా చిరుత సంచారాన్ని స్వయంగా చూశారు. విషయం వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు ఆ ప్రాంతంలో లో ఉండే స్థానికులు,భక్తులను అప్రమత్తం చేశారు. అలాగే అటవీ అధికారులకు సమాచారం అందించారు.
శ్రీశైలం పాతళగంగ మెట్ల మార్గం ద్వరానే వెళ్లిరోజు తెల్లవారుజామున పాతాళ గంగలో స్నాన మాచరిస్తారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే పాతాళ మెట్ల మార్గానికి సమీపంలోనే స్థానికుల నివాస ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి చోట చిరుత సంచారం భయాందోళనలకు కలిగిస్తోంది. మైకుల ద్వారా చిరుత పులి సంచారాన్ని తెలియజేస్తు అందరినీ అప్రమత్తం చేసిన ఆలయ అధికారులు.. అటవీ శాఖ సిబ్బంది సాయంతో చిరుతను గుర్తించి బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


