దిగ్గజ పారిశ్రామిక వేత్త సుజుకి ఒసామో కన్నుమూత 

posted on: Dec 27, 2024 2:38PM

దిగ్గజ పారిశ్రామిక  సంస్థ  సుజుకి మోటార్ కార్పోరేషన్ మాజీ సీఈవో  ఒసాము సుజుకి క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. ఆయన వయస్సు 94 . లింఫోమా అనే క్యాన్సర్ తో చనిపోయినట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జపాన్ లోని గెరోలో 1930 జనవరి 30న జన్మించిన సుజుకి 1958లో ఆటో మేకర్ లో చేరారు. సుజుకి 91వ ఏట  అంటే 2021లో  తన రిటైర్మెంట్ ప్రకటించారు. తన వారసుడికి సుజుకి అధ్యక్ష పదవిని అప్పగించిన సుజుకి ఓసాము తన భార్య ఇంటి పేరును తీసుకుని ప్రపంచవ్యాప్తంగా చిన్న కార్లు, మోటార్ సైకిళ్లను తయారుచేసి బ్రాండ్ గా మార్చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...