సీఎం.. అయన సలహాదారులు.. హైకోర్టు సందేహాలు

ఏపీ ప్రభుత్వానికి అటు హైకోర్టులోనూ ఇటు సుప్రీం కోర్ట్ లోనూ అనేక సార్లు మొట్టికాయలు పడిన సంగతి తెలిసిందే. అంతే కౌకండా సాక్షాత్తు సీఎస్, డీజీపీ కూడా కోర్ట్ మెట్లు ఎక్కవలసి వచ్చింది. తాజాగా రాష్ట్ర డీజీపీ నిన్న హైకోర్టు లో హాజరైనప్పుడు ఈ విషయం పై కోర్ట్ కొన్ని స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. అసలు ప్రభుత్వానికి న్యాయ సలహాదారులు గా ఉన్నవారు అటు ప్రభుత్వానికైనా సరైన సలహాలు ఇవ్వడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా వారు కోర్టుకు కూడా సరిగా సహకరించడం లేదని అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తోందని కోర్ట్ వ్యాఖ్యానించింది.

అసలు ఏ వ్యక్తికీ ప్రభుత్వానికి కోర్ట్ వ్యతిరేకం కాదు. ఐతే ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వకుండా కేవలం కోర్టులను నిందిస్తే ఫలితమేంటని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కొంతమంది కింది స్థాయి అధికారుల అత్యుత్సాహం తో పాటు .విపరీత ప్రవర్తన కారణంగా ఉన్నతాధికారులు కోర్ట్ లో నిలబడాల్సి వస్తోందని డీజీపీ ఎదుటే హైకోర్టు వ్యాఖ్యానించింది చిన్న చిన్న కేసుల విషయంలో కూడా ఇలా జరగడం ఎంతైనా ప్రభుత్వానికి ఇబ్బందికరమే. ఇంతకూ దీనికి కారణం సలహాదారులు ప్రభుత్వానికి, సీఎం కు సరైన సలహాలు ఇవ్వకపోవడమా లేక అయన ఎవరి సలహాలు పట్టించుకోరా.. నిన్ననే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆప్త మిత్రుడు ఉండవల్లి ఇదే విషయమై మాట్లాడుతూ వ్యవస్థలతో వైరం మంచిది కాదని సీఎం జగన్ ను సున్నితంగా హెచ్చరించారు.