‘బ్లూ’ హీరోయిన్‌ని చంపుతారట...
posted on Jan 8, 2015 8:33AM

లెబనాన్ జాతీయురాలు అయినప్పటికీ అమెరికాలో స్థిరపడిన పోర్న్ స్టార్ మియా ఖలీఫా అటు సినిమాలు, ఇటు పోర్న్ వీడియోలు, మరోవైపు పోర్న్ ఫొటోగ్రఫీలో ఫుల్లు బిజీగా వుంది. అంతేకాదు... మాంఛి ‘విషయం’ వున్న సెల్ఫీలు తీసి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే విషయంలో కూడా మియా ఖలీఫా చాలా ఫార్వర్డ్‌గా వుంది. ఇంటర్నెట్ మసాలా ఫొటోల సామ్రాజ్యంలో మియా ఖలీఫా తర్వాతే ఎవరైనా అనుకునేంత రేంజ్‌లో ఈమె రెచ్చిపోతూ వుంటుంది. అమెరికాలో సమకాలీన పోర్న్ స్టార్స్ అందరికంటే చాలా బిజీగా, లైమ్‌లైట్‌లో వున్న 21 ఏళ్ళ అందగత్తె మియా ఖలీఫా. అయితే పాపం ఈమధ్య ఈ అందగత్తెకి కొన్ని కష్టాలొచ్చిపడ్డాయి. మియా ఖలీఫాని, ఆమె కుటుంబాన్ని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి కొద్దికాలంగా బెదిరిస్తున్నాడట. ‘నిన్ను మెడకోసి చంపుతా’ అని ఆ వ్యక్తి ఫోన్‌చేసి చెబుతున్నాడట. ఈ బెదిరింపులు అమెరికాలో లెబనాన్ పరువు తీస్తోందన్న ఉద్దేశంతో లెబనాన్‌కి చెందిన ఎవరైనా చేసి వుండొచ్చని కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఎక్కడో లెబనాన్ నుంచి వచ్చి అమెరికాలో హవా నడిపిస్తోందన్న అక్కసుతో ఇతర అమెరికన్ పోర్న్‌స్టార్స్ ఎవరైనా ఇలా బెదిరింపు కాల్స్ చేయిస్తూ వుండొచ్చన్న అనుమానాలూ వున్నాయి.