TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

నూతన సచివాలయానికి సీఎం శంకుస్థాపన

Published on: Thu Jun 27, 2019 12:00PM

 

తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నూతన సచివాలయం భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఈరోజు(గురువారం) ఉదయం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం డి-బ్లాక్‌ వెనుక భాగంలోని తోటలో కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.400 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. సచివాలయం ప్రస్తుతం 25 ఎకరాల్లో ఉండగా దాన్ని 30 ఎకరాల మేరకు విస్తరించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలతో కలిసి కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్‌ తొలుత భూమిపూజ చేశారు. అనంతరం పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఎర్రమంజిల్ లో నిర్మించ తలపెట్టిన నూతన అసెంబ్లీ భవనానికి శంకుస్థాపన చేశారు..