TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాప్సిమీద మనసుపడ్డ లారెన్స్

Published on: Thu Nov 29, 2012 2:06PM

 

 

 

బొద్దు సుందరి తాప్సీ అందాల్ని చూసి లారెన్స్ ఫ్లాటైపోయాడు. ఒక్కసారి.. కనీసం ఒక్క ఛాన్సైనా కావాలనుకున్నాడు.. వెంటనే ఆఫరిచ్చాడు. లారెన్స్ తో చేయడానికి తాప్సీకూడా ఇష్టపడింది. ఇద్దరి దూకుడుని చూసి అటు తమిళ సినీ వర్గాలు, ఇటు తెలుగు సినీ వర్గాలూ ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నాయి. 

ఇదంతా లారెన్స్ కొత్త సినిమా ముని 3 కి సంబంధించిన వ్యవహారం. తెల్లతోలు సుందరి అందం తన పక్కన నిలబడితే రెట్టింపౌతుందన్న ధ్యాసకూడా లేనంతగా లారెన్స్ ఫ్లాటయ్యాటంటే తాప్సీ ఈ మధ్య గ్లామర్ ఎంతగా పెంచిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి తాప్సీ తెలుగులో చేసిన సినిమాలన్నీ ఫట్టయ్యాయి.

ఒక్క మిస్టర్ పర్ ఫెక్ట్ మాత్రం కాస్తో కూస్తో మంచి టాక్ తీసుకొచ్చింది. అందులోకూడా తాప్సీ సెకండ్ హీరోయిన్ గానే చేసింది. తాప్సీ తమిళంలో చేసిన సినిమాల్నిచూసి పడిపోయిన లారెన్స్ తన లేటెస్ట్ మూవీలో ఛాన్సిచ్చాడు. ఈ సినిమా షూటింగ్ జనవరినుంచి మొదలవుతుందని నిర్మాత బెల్లంకొండ సురేష్ చెబుతున్నారు.