TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానం.. హోంశాఖ వైఫల్యం

Published on: Wed Jun 24, 2026 3:37PM

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్, సిట్  విచారణ, మరోవైపు హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ ఈ కేసును మరింత జటిలంగా మార్చాయి. అసలు సాయికృష్ణ ఏమయ్యాడు? అతను సజీవంగా ఉన్నాడా లేదా అన్న ప్రశ్నలపై జూన్ 29వ తేదీన కోర్టుకు పోలీసులు ఏం సమాధానం చెబుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగరాజు గత ఐదేళ్ల కాలంలో దాదాపు 100 కోట్ల రూపాయల వరకు అక్రమాస్తులు కూడబెట్టాడని, అతని వేధింపుల వల్ల ఎంతో మంది బాధితులు ఆత్మహత్యల అంచులకు వెళ్లారని ఆరోపించారు. అయితే, దీనికి భిన్నంగా విజయవాడ కృష్ణలంక స్థానికులు సీఐ నాగరాజుకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం గమనార్హం. నాగరాజు ఉండటం వల్లే తమ ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి ముఠాల ఆగడాలు అణచివేయబడ్డాయని, తాము ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో  ఈ అంశంపై అసలేం జరుగుతోంది, ఏం జరగాల్సి ఉందన్న విషయంపై ప్రముఖ విశ్లేషకుడు సుంకర వెంకటేశ్వరరావు (సువేరా) తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్టాడారు. 

గాదె సాయికృష్ణ నేర చరిత్ర కూడా ఈ కేసులో చర్చనీయాంశమనీ, అతనిపై పోక్సో చట్టం, అత్యాచారాలు, హత్యాయత్నాలు, ఎన్బీడబ్ల్యూ, ఎన్డీపీఎస్  గంజాయి రవాణా వంటి ఏకంగా 23 తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయని చెప్పిన సువేరా. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఇందుకు ప్రధాన కారణం 2019 నుంచి 2024 వరకూ రాష్ట్రంలో సాగిన అరాచకపాలనే కారణమన్నారు. ఇక సాయి సాయికృష్ణ విషయానికివస్తే...చేతిలో నవీన్ రెడ్డి అనే వ్యక్తి దారుణంగా గాయపడ్డాడని, బీరు సీసాతో పొడవడంతో 5 అంగుళాల లోతుకు గాయం అయిందని బాధితులు గుర్తు చేసుకుంటున్నారు. సమాజానికి ముప్పుగా మారిన ఇలాంటి అసాంఘిక శక్తులను చట్ట పరిధిలోనే అణచివేయాలని సుంకర వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

ఈ కేసును కొన్ని రాజకీయ శక్తులు, కుల సంఘాలు తమ స్వార్థానికి వాడుకుంటున్నాయని విమర్శించిన సువేరా. వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ లాంటి మాజీ మంత్రులు కుల కోణంలో సమావేశాలు నిర్వహించి, తమ సామాజిక వర్గాన్ని రక్షించుకుంటామని స్టేట్‌మెంట్లు ఇవ్వడం దారుణమన్నారు. ఒక క్రిమినల్ వెనుక కుల ముసుగు వేయడం సరికాదన్నారు.  

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఏపీ హోం శాఖ మరియు ఇంటెలిజెన్స్ వ్యవస్థల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని సువేరా అన్నారు. ప్రాథమిక ఆధారాలు లేకుండానే ఒక సీఐని  ముందే సస్పెండ్ చేయడం ప్రభుత్వ అనాలోచిత చర్యగా కనిపిస్తోందన్నారు సువేర