లతా మంగేష్కర్‌కు గుడి కట్టిన అభిమాని

 

ఇన్నాళ్లు హీరో హీరోయిన్లకు మాత్రమే గుడులు కట్టిన అభిమానులు ఇప్పుడు ఓ గాయనికి కూగా గుడి కట్టారు. అయితే ఇన్నాళ్లు దక్షిణాదిలో మాత్రమే ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారనుకున్నారు అంతా ఈ అభిప్రాయం తప్పని నిరూపిస్తూ మధ్యప్రదేశ్‌ కు చెందిన వర్షా జాలని భారత గాన కోకిల లతామంగేష్కర్‌కు గుడకట్టించారు.


ఇప్పుడిప్పుడే గాయనిగా నిలదొక్కుకుంటున్న గాయని వర్షా జాలని తన అభిమాన గాయని అయిన లతామంగేష్కర్‌పై తన అభిమానాన్ని గుడి కట్టి మరీ నిరూపించుకుంది. లతాను దేవతలా ఆరాధించే వర్ష తన ఇంట్లోనే ఆమె కోసం ఓ ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకుని లత ఫొటో ఉంచింది.


వర్ష ఆ ఫొటో ముందు నిల్చునే పాటలు పాడటం సాధన చేసేదట. 'రెండు దశాబ్దాలుగా లతాజీ ప్రార్థన మందిరంలో సాధన చేస్తున్నాను. ఆమె ఫొటో చూడగానే ఆత్మవిశ్వాసం, ప్రేరణ కలుగుతాయి' అని వర్ష అంటోంది. మూడు రోజుల క్రితం లతా మంగేష్కర్‌ను కలిసిన వర్షా భవిష్యత్తులో మంచి గాయనిగా పేరు తెచ్చుకోవాలనుకుంటుంది.