TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'అప్పుడు రైతులకైతే ఇప్పుడు కాంగ్రెసుకు గడ్డుకాలం'

Published on: Mon Jan 2, 2012 9:24AM

హైదరాబాద్: గత సంవత్సరం రైతులకు గడ్డు పరిస్థితి అయితే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి,కాంగ్రెసుకు  గడ్డుకాలమవుతుందని   భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేసారు.కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనం, జగన్ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించడం పార్లమెంటరీ సంప్రదాయాలు మంటగలిపాయని అయన  అన్నారు. స్పీకర్ పదవిని కాంగ్రెసు స్వప్రయోజనాలకు వాడుకోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని అసహాయస్థితిలో ఉన్నారన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడం కాంగ్రెసుకు అలవాటే అన్నారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్ల అక్రమాల్లో ప్రమేయం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకునేందుకు కిరణ్ భయపడుతున్నారన్నారు.  వచ్చే ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు కాంగ్రెసుకు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.రు.