TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు

Published on: Sat Oct 8, 2022 7:39AM

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు అవాంతరం ఏర్పడింది. ఇక శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం కలిగింది.  

ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి.  విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో శ్రైశైలం వెళ్లే ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు.  

కొండ చరియలు విరిగిపడిన సమయంలో ఆ మార్గంలో వాహనాలేవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిత్యం ఘా ఘాట్ కుండా వందల సంఖ్యలో వాహనాలలో భక్తులు శ్రీశైలానికి వెళుతుంటారు. కొండచరియలు విరిగిపడటంతో   వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలను తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేస్తున్నారు.