TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతి టిడిపి అభ్యర్థిపై భూఆక్రమణల వివాదం

Published on: Mon May 14, 2012 12:07PM

తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న చెదలవాడ క్రుష్ణమూర్తిపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి సమీపంలోని రామినీడు పంచాయితీ ప్రాంతంలో సర్వే నెంబర్ 101/2, 103/4 104, 140, 138, 130లలో 80 ఎకరాల ప్రభుత్వభూమిని చెదలవాడ కబ్జా చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను సేకరించిన ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఎం.వెంకటరమణ వాటిని ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలుస్తోంది. చెదలవాడ పేరును టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించినప్పటి నుంచి ఆయనపై వివాదాలు చెలరేగుతున్నాయి.

 

 

కాంగ్రెస్ పార్టీకి చెందిన చెదలవాడను టిడిపిలోకి ఆహ్వానించిన మరీ టిక్కెట్టు ఇప్పించారు. దీంతో తిరుపతి నగరంలోని టిడిపి శ్రేణులు భగ్గుమన్నాయి. చెదలవాడ పేరు ప్రకటించగానే ఈ ప్రాంతంలోని చెరకు రైతులు ఆయనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చెదలవాడ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న చెక్కర కర్మాగారం రైతులకు సుమారు పదికోట్ల రూపాయల మేరకు చెరకు బిల్లులు బకాయిపడి ఉంది. లాభాల్లో ఉన్న తమ కర్మాగారం చెదలవాడ రాకతో నష్టాలపాలైందని, తమకు బిల్లులు కూడా సక్రమంగా చెల్లించడం లేదంటూ రైతులు రోడ్డెక్కారు. ఈ వివాదం సద్దుమణుగుతున్న తరుణంలో చెదలవాడ మెడకు భూవివాదం చుట్టుకుంది. దీంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.