లాలూని రైలెక్కించిన పోలీసులు... విమానం ఎక్కించేంత డబ్బు లేదు...


దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రసాద్ ప్రస్తుతం జార్ఖండ్ లోని బిర్సాముండా జైలులో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వివాదం చోటుచేసుకుంది. గత కొద్దిరోజులగా లాలూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆయనకు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాలని వైద్యులు సలహా ఇచ్చారు. అయితే లాలూని చికిత్స నిమిత్తం ఢిల్లీకి తరలించే క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వం కొత్త వివాదానికి తెరలేపింది. ఆయన్ను విమానంలో పంపేంత డబ్బు తమ వద్ద లేదన్న జార్ఖండ్ ప్రభుత్వం, ఆయన్ను బలవంతంగా రైల్లో ఢిల్లీకి పంపింది.  రాంచీ నుంచి 16 గంటల పాటు రైల్లో ప్రయాణించిన లాలూ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరి చికిత్సను పొందుతున్నారు. మరోవైపు దీనిపై ఆర్జేడీ తీవ్రంగా మండిపడింది. ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలిసి కూడా అంతదూరం పాటు రైల్లో ప్రయాణానికి ఎలా అనుమతించారని, ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది.