దాణా కుంభకోణ.. మూడోసారి కూడా దోషిగా లాలూ..

 

ఇప్పటికే దాణా కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఆయనకు మూడున్నరేళ్లు జైలు శిక్ష కూడా పడింది. ఇప్పుడు తాజాగా దాణా కుంభకోణానికి సంబంధించి మూడో కేసులోనూ లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. బుధవారం దాణా కేసును విచారించిన రాంచీ సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఆయన్ను దోషిగా తేల్చింది. 1992-93లో చాయ్‌బసా ఖజానా నుంచి అక్రమంగా రూ.33.67 కోట్లను విత్‌డ్రా చేసినట్టు నిర్ధరించింది. దాణా కుంభకోణంలోని రెండో కేసులో నిర్దోషిగా బయటకు వచ్చిన బిహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాను.. మూడో కేసులో మాత్రం దోషిగా తేల్చింది కోర్టు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.7.10 లక్షలకు బదులు నకిలీ పత్రాలను సృష్టించి రూ.33.67 కోట్లను అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలను వారు ఎదుర్కొంటున్నారు. తాజాగా కోర్టు వారిని దోషులుగా తేల్చింది. లాలూ సహా జగన్నాథ్ మిశ్రాకు గురువారం శిక్షలు ఖరారు చేయనుంది సీబీఐ ప్రత్యేక కోర్టు.