లాలూ శిక్షపై జడ్జి...నాకు చాలా కాల్స్ వస్తున్నాయి..

 

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ను దోషికా తేల్చుతూ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ కేసులో తీర్పును కోర్టు ఈ రోజుకు వాయిదా వేసిన సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో లాలూ ప్ర‌సాద్‌ యాద‌వ్‌ను బిర్సా మండా సెంట్ర‌ల్ జైలు నుంచి జార్ఖండ్‌ రాంచీలోని సీబీఐ కోర్టుకు కూడా తీసుకొచ్చారు. లాలూతో పాటు ఈకేసులో దోషులుగా తేల్చిన మరో 15 మందిని కూడా కోర్టులో హాజరుపరిచారు. దీంతో లాలూ శిక్షపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో కోర్టు శిక్ష ఖ‌రారును రేపు ప్రకటించనున్నట్లు తెలిపింది. అయితే ఈ కేసులో లాలు ప్రసాద్ యాదవ్‌కి ఏడు సంవత్సరాల శిక్షను విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

మరోవైపు లాలూకి వయసు పైబడటంతో శిక్ష విషయంలో కాస్త ఆలోచించాలని.. కాస్త తక్కువ శిక్ష విధించాలని లాలూ తరపు న్యాయవాదులు కోరుతున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ తీర్పుపై మాట్లాడిన జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాలూ కోసం చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు.. చాలా మంది రిఫరెన్స్ లు ఇస్తున్నారు.. కానీ డోన్ట్ వర్రీ... నేను లా ప్రకారమే ముందుకు వెళతా అని చెప్పారు. కాగా 1990-94 మధ్య కాలంలో దియోగర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ నుంచి రూ. 84.5 లక్షల అవినీతి జరిగినట్టు లాలూపై కేసు నమోదైంది.