సోనియాకి లాలూ ఫోన్.. మీరు ఏదంటే అదే..!


త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎలాగైనా తమ అభ్యర్ధిని గెలిపించుకోవాలని చూస్తుంది. నిజం చెప్పాలంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అన్నింటా ఘన విజయం సాధించి మంచి ఫాంలో ఉందనే చెప్పొచ్చు. ఇక మిత్ర పక్షాల మద్దతు ఎలాగూ ఉంది. దీంతో బీజేపీ అభ్యర్ధి గెలవడం కష్టమైన పనేం కాదు. అయితే బీజేపీని ఎలాగైనా ఓడించాలని.. కాంగ్రెస్ పార్టీ సహా కొన్ని పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ సోనియాగాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సోనియా గాంధీకి ఫోన్ చేసిన ఆయన "మేడమ్... మీరు నిర్ణయం తీసుకోండి. మీ వెనకాలే నడుస్తాం" అని తనకు చెప్పినట్టు సమాచారం. ఎవరి పేరును సూచించినా, మరో మాట మాట్లాడకుండా మద్దతిస్తామని అన్నారట. మొత్తానికి బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలు బాగానే కలిసి పోరాటం చేస్తున్నట్టున్నాయి.