లాలూ చేతిలో ఆలూ..
Published on: Fri Mar 10, 2017 11:17AM

'ఆలూతో లాలూ' ఇదేంటీ అనుకుంటున్నారా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మీద వస్తున్న ఫన్నీ కామెంట్స్. అసలు సంగతేంటంటే.. లాలూ తన సొంత పొలంలో ఆలూ పంటను పండించారు. ఈ నేపథ్యంలో ఓ పెద్ద ఆలూను పట్టుకుని ఫోటో దిగి.. ఈ సంవత్సరం మంచి పంట చేతికి వచ్చిందని చెప్తూ..ఆ ఫొటోలను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దాంతో నెటిజన్లు లాలూ చేతిలో ఆలూ అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.


