మా కోడలు బంగారం.. అన్నీశుభాలే...

 


మా కోడలు ఇంట్లో అడుగుపెట్టడంతో అంతా శుభమే జరుగుతోంది.. ఇంతకీ ఎవరా కోడలు... ఈవ్యాఖ్యలు చేసింది ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు.. మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి. తన కోడలు గురించి చెబుతూ ఆమె మురిసిపోయింది. అసలు సంగతేంటంటే.. శనివారం నాడు లాలూ తనయుడు తేజ్‌ప్రతాప్ యాదవ్‌కు, ఐశ్వర్యరాయ్‌కు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూ, రబ్రీ దేవిని మీడియా పరలకరించింది. దీంతో  రబ్రీదేవి కొత్త కోడలు గురించి చెబుతూ.... ‘ మా కోడలు బంగారం. ఆమె రాకతో మాకన్నీ శుభ సూచకాలే. అన్ని మంచి సంఘటనలే జరుగుతున్నాయి’ అని వెల్లడించారు. ఐశ్వర్యరాయ్‌ ఎంగేజ్‌మెంట్ జరిగిన తరవాతే లాలూకు మూడు రోజుల పెరోల్ వచ్చిందని, ఆరు వారాల ప్రొవిజినల్ బెయిల్ వచ్చిందని.. అంతేకాదు.. విధాన పరిషత్‌లో ఆమె ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యారని తెలిపారు. కాగా మూడు రోజుల పెరోల్ సమయం ముగియడంతో తిరిగి లాలూ రాంచీ జైలుకు వెళ్లిపోయారు. అయితే  వైద్య పరీక్షల నిమిత్తం ఆయనకు లభించిన ఆరువారాల ప్రొవిజనల్ బెయిలు ఈరోజు నుండి అమల్లోకి రావడంతో..తిరిగి పట్నాకు చేరుకోనున్నారు.