లాలూకి పద్నాలుగేళ్ల జైలు శిక్ష...


లాలూ ప్రసాద్ యాదవ్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే దాణా కుంభకోణం కేసులో లాలూకి జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. మూడు కేసుల్లోనూ దోషిగా తేలడంతో.. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి రాంచీలోని బిర్సా ముండా జైలులో లాలూ శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు నాలుగో కేసులో కూడా ఆయనకు శిక్ష పడింది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూ ప్రసాద్ యాదవ్ కు పద్నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. దుమ్కా కోశాగారం నుంచి అక్రమంగా రూ. 3.13 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై లాలూతో పాటు మరికొందరిపై ఈ కేసు నమోదు చేశారు. కాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది.