లాలూపై అనర్హత వేటుకి రంగం సిద్దం

 

పశువుల దాణా కుంభకోణంలో దోషిగా నిర్దారింపబడి ఐదేళ్ళు జైలు శిక్షపడి ప్రస్తుతం రాంచీ జైలులో ఊచలు లెక్కబెడుతున్నపార్లమెంటు సభ్యుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరియు మెడికల్ సీట్ల కుంభకోణంలో నాలుగేళ్ల జైలు శిక్షపడిన రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్ లపై వెంటనే అనర్హత వేటు వేసి, పార్లమెంటులో వారి స్థానాలు ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘానికి సూచించాలని అటార్నీ జనరల్ జీ.ఈ.వాహనవతి లోక్ సభ సెక్రెట్రియెట్ కు సూచించారు. ఇంకా జాప్యం చేసినట్లయితే అది కోర్టు దిక్కారం క్రింద పరిగణింపబడే ప్రమాదం ఉందని ఆయన సెక్రెట్రియెట్ అధికారులను హెచ్చరించారు. రషీద్ పై అనర్హత వేటువేసేందుకు ఇప్పటికే ప్రక్రియ మొదలవగా, ఇప్పుడు వాహనవతి హెచ్చరికతో లాలూపై కూడా అనర్హత వేటుకి రంగం సిద్దం అవుతోంది.