TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గ్రామాన్ని దత్తత తీసుకున్న లక్ష్మీనారాయణ...

Published on: Sat May 5, 2018 11:37AM

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన పదవికి స్వచ్ఛంద రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన వీఆర్‌ఎస్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. దీంతో ఆయన ఇప్పుడు పూర్తిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లిపోయారు. ఇక ఆయన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఆయన సహలాలపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక వర్గం కాదు సమాజమే ముఖ్యమని, విమర్శలు చేస్తున్నవారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడాలని ఈ సందర్భంగా హితవు పలికారు. పర్యటనలో రైతులు, చేనేత కార్మికులను కలుస్తున్న ఆయన వారితో మాట్లాడుతూ కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. కాగా లక్ష్మీనారాయణ మూడు రోజుల పర్యటన ఈరోజుతో ముగియనుంది.