మాయావతి పై విరుచుకుపడిన రాహుల్
Published on: Mon Feb 6, 2012 3:37PM
లక్
నో: మాయావతి పై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బిఎస్పీ ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సోమవారం ఉత్తర ప్రదేశ్‌లో అన్నారు. యుపి అభివృద్ధే తన లక్ష్యమన్నారు. మాయా ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని, 22 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు వంచనకు గురయ్యారన్నారు. ఏ పార్టీతోనూ పొత్తులుండవని స్పష్టం చేశారు. బిఎస్పీ ఆటలు ఇక సాగనివ్వమన్నారు. బిఎస్పీ హయాంలో రాష్ట్రంలో నేరాలు పెరిగాయని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వారణాశి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొందరు ప్రధాన నేతల దృష్టి పిఎం పదవిపై ఉండవచ్చునని, కానీ తన దృష్టి మాత్రం ప్రధానమంత్రి పదవిపై లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం పైనే తాను దృష్టి సారిస్తున్నానని అన్నారు. అవినీతి అంటూ రథయాత్ర చేస్తున్న బిజెపి అగ్రనేత అద్వానికి కర్నాటకలోని అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అవినీతి కాంగ్రెసులోనే కాదు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనూ ఉందన్నారు. లోక్‌పాల్‌కు రాజ్యాంగబద్దత కావాలని తాను అన్నప్పుడు ప్రతిపక్షాలు నవ్వాయని, ఇది త్వరలో అవుతుందన్నారు.


