యుపిలో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్
Published on: Tue Jan 31, 2012 4:00PM
లక్
నో: ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. వచ్చే అయిదు ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని తెలిపింది. జనాభా ఆధారంగా మైనార్టీలకు 4.5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామి ఇచ్చింది. ప్రతి గ్రామంలో పాఠశాల నిర్మాణం చేపడతామని తెలిపింది. లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రిని తీసుకువస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. దారిద్ర్య రేఖకు దిగువనున్న ఎస్సి, ఎస్టిలకు ఉచిత విద్యుత్ని అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.


