లగడపాటి మరోసారి రాజీనామా

 

 

 

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ రోజు మరోసారి రాజీనామాకు సిద్దమయ్యారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఢిల్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తన రాజీనామా పత్రాన్ని స్వయంగా అందజేయనున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ గతంలో చేసిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ రెండురోజుల కిందట తిరస్కరించారు. ఈ నేపథ్యంలో లగడపాటి మళ్ళీ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామాను ఆమోదించుకున్న తర్వాత సంచలన విషయాలు చెబుతానని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ సరైన లగడపాటి రాజీనామాను స్పీకర్ అమోదిస్తారో?లేదో