'మోడీ' ఆంధ్రాని మోసం చేశారు...నిజమేనట..


మోడీకి ఏపీ మీద చిన్నచూపు ఉందన్నసంగతి కాస్త రాజకీయానుభవం ఉన్న ఎవరిని అడిగినా చెబుతారు. ఇక పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఏపీకి అన్యాయం జరిగిన తీరుపై సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎవర్ని అడిగినా చెబుతారు. ఆంధ్రా ప్రజలను ప్రధాని మోడీ నమ్మించి మోసం చేశారని బల్లగుద్దిమరీ చెబుతారు. ఇక ఈ విషయంపై ఆంధ్రా అక్టోపస్‌ 'లగడపాటి రాజగోపాల్‌' ఇటీవల ఓ సర్వే కూడా నిర్వహించారట. ఈ సర్వేలో కూడా ఆంధ్రా ప్రజలను మోసం చేశారని 93శాతం మంది చెప్పారట. ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా.. ప్రధాని మోడీ మోసం చేశారా...? ఎన్డీఎ నుంచి చంద్రబాబు తప్పుకోవాలా..? ఎంపీలు రాజీనామాలు చేయాలా..? ప్రస్తుత పరిస్థితుల్లో ఎపిని గట్టెక్కించేవారు ఎవరు..? మోడీ,జగన్‌లు ఒప్పందం చేసుకోవడం వల్లే..హామీలను నెరవేర్చడం లేదా..? వంటి పన్నెండు ప్రశ్నలకు ప్రజలకు 'లగడపాటి' టీమ్‌ సంధించిందట. దీనిలో భాగంగా 'మోడీ' ఆంధ్రాని మోసం చేశారా..? అన్న ప్రశ్నకు 93శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారట. కేంద్రంతో పోరాడినా లాభం లేదని 47శాతం మంది చెప్పారట. అదే సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రాను గట్టెక్కించేదెవరన్న ప్రశ్నకు 78శాతం మంది 'చంద్రబాబు' పేరు చెప్పారట. అదే విధంగా..కేసుల కోసం బిజెపితో 'జగన్‌' లాలూచీ పడ్డారా అన్న ప్రశ్నకు 66శాతం మంది అవునని సమాధానం చెప్పారట. ఎన్డీఎ నుంచి తక్షణమే మంత్రులు తప్పుకోవాలని 82శాతం మంది చెప్పారట.

 

అయితే ఈ సర్వే వివరాలు ఇంకా అధికారికంగా అయితే బయటకు రాలేదు. 'లగడపాటి' స్వయంగా సర్వే వివరాలు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని.. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని అంటున్నారు. మరి లగడపాటి చేసిన సర్వేలు దాదాపు ఇప్పటివకూ నిజమయ్యాయనే అంటారు. అయినా లగడపాటి సర్వే చెప్పినా.. చెప్పకపోయినా.. మోడీ మాత్రం ఏపీ ప్రజలకు మోసం చేశారన్నది అందరి అభిప్రాయం.. చూద్దాం..మరి ఏం జరుగుతుందో..!?