TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్నికలకు ముందే సర్వే వివరాలు--లగడపాటి

Published on: Mon Jul 30, 2018 12:41PM

ఎన్నికలకు ముందు సర్వే నిర్వహించి ఎవరు గెలిచే అవకాశం ఉందో ఓ అంచనాకు వస్తారు రాజకీయ నాయకులు.కానీ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేపట్టే సర్వే మాత్రం ప్రతిసారి ఎన్నికల ముందు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది.ఆయన చెప్పిన ప్రకారమే దాదాపు గెలుపోటములు ఉంటాయి.తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అప్పట్లో కీలకంగా వ్యవహరించిన లగడపాటి రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇటీవల కాలంలో రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు.

 

 

అనంతపురంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న లగడపాటి సర్వే వివరాలు ఎన్నికలకు ముందు తెలియజేస్తానని చెప్పారు.ఇదే సందర్భంలో రాష్ట్రాన్ని విభజించినందుకు ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని… ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీకి కూడా అదే గతి పడుతుందని లగడపాటి అన్నారు.ప్రాణత్యాగాలతో ప్రత్యేక హోదా రాదని, పోరాటాల ద్వారానే హోదాను సాధించగలమని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే… పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని, తద్వారా ఉద్యోగాలు లభిస్తాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారని తెలిపారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు.