TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్పీకర్ పై హైకోర్ట్ కు లగడపాటి

Published on: Tue Oct 8, 2013 3:06PM

 

Lagadapati Rajagopal, High court, Seemandhra MPs Resigned, Seemandhra MPs

 

 

రాష్ట్ర విభజనను నిరసిస్తూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ అందజేసిన విషయం తెలిసిందే. అయితే తన రాజీనామాను ఆమోదించడంలేదని లగడపాటి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజీనామా లేఖ అందజేసి 65 రోజులు గడుస్తున్నప్పటికీ దానిని స్పీకర్ ఆమోదించలేదని, దానిని ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. స్పీకర్ రాజీనామా పైన నిర్ణయం తీసుకోకపోవడంతో తాను ఇష్టం లేకున్నా పదవిలో కొనసాగుతున్నానని పేర్కొన్నారు. తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని పలుమార్లు స్పీకర్‌ను కోరానన్నారు.