లగడపాటి కొత్త కోరిక

 

 

 

విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా త్వరలో పదవీ విరమణ చేయబోతున్న లగడపాటి రాజగోపాల్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర విభజన జరిగితే తాను ఎన్నికలలో నిలబడనని చెప్పిన లగడపాటి ఆ మాట ప్రకారం ఎన్నికలలో నిలబడలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి శాయశక్తులా కృషి చేసిన లగడపాటి కాంగ్రెస్ పార్టీ చేతిలో తాను మోసపోవడంతోపాటు, ఆయన్ని నమ్మిన తెలుగు ప్రజలు కూడా మోసపోయేలా చేశారు. మొన్నీమధ్యే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన లగడపాటి సీమాంధ్రలో తెలుగుదేశం హవా ఖాయమని చెప్పారు.


అంతా బాగుందిగానీ, ఓటు వేసిన తర్వాత లగడపాటి వ్యక్తం చేసిన కోరిక మాత్రం విచిత్రంగా వుంది. ఆంధ్రప్రదేశ్ పేరును ‘తెలుగునాడు’ అని మార్చాలట. అలా మారిస్తే తాను చాలా హ్యాపీగా ఫీలవుతాడట. యాక్టివ్ రాజకీయాల్లో లేకపోవడంతో తీరిగ్గా వున్న లగడపాటికి ఇలాంటి కొత్తకొత్త కోరికలు పుట్టుకొస్తున్నాయన్నమాట. అయ్యా లగడపాటీ, ఇప్పుడు సీమాంధ్రులకు కావలసింది రాష్ట్రం పేరు మార్పు కాదు.. మీ కాంగ్రెస్ పార్టీ కారణంగా దారుణంగా మోసపోయిన వారికి ఊరట. అలా ఊరట రావాలంటే రాష్ట్రం పేరు మార్చితే సరిపోదు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని సమర్థంగా చేయాల్సి వుంటుంది.