వైద్యురాలి ఆత్మహత్య
Published on: Wed Nov 19, 2014 2:24PM

సికింద్రాబాద్‌లోని పద్మారావు నగర్ ప్రాంతంలో మహాలక్ష్మి అనే డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో డాక్టర్‌గా మంచి పేరున్న మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసి పద్మారావు నగర్ ప్రాంత ప్రజలు షాకయ్యారు. డాక్టర్ మహాలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రధాన కారణం ఆమె భర్త వేధింపులేనని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహిళల మీద వేధింపుల తీవ్రతకు ఇదొక తార్కాణంగా నిలుస్తుంది. భర్తమీద ఆధారపడిన మహిళలు మాత్రమే కాకుండా బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు కూడా భర్త నుంచి వేధింపులకు గురవుతున్నారు. అయితే డాక్టర్ చదివిన మహాలక్ష్మి తన భర్త నుంచి ఎదురవుతున్న సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారంగా ఎంచుకోవడం బాధాకరం. కనీసం చదువుకున్న మహిళలు అయినా మగవాడి వేధింపులను ఎదిరించి నిలవాలన్న అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి.


