TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆమె అతను సహజీవనం చేశారు.. చివరికి ఆమెకు నిప్పు అంటించాడు..  

Published on: Fri Jun 11, 2021 5:02PM

ఒకప్పుడు మరి గురించి ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలంటే.. మన అమ్మానాన్నలను అడిగి తెలుసుకునే వాళ్ళు.. లేదంటే మన స్నేహితులను అడిగి తెలుసుకునే వాళ్ళు . అదికూడా కాదంటే నేరుగా మనల్ని అడిగి తెలుసుకునే వాళ్ళు.. సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో మన గురించి మన అలవాట్ల గురించి ఎవరైనా , ఎక్కడ ఉంది అయినా నేరుగా తెలుసుకుంటున్నారు.. ఒకరకంగా చెప్పాలంటే  సోషల్ మీడియా మన జీవితానికి తెరిచినా పుస్తకం అని చెప్పాలి. ఇంట్లో, బయట ఏ చిన్న విషయం జరిగిన అందరికి తెలిసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కొందరికి అలవాటు.. తాజాగా అలాంటి అలవాటే ఒక అమ్మాయి ప్రాణాలు తీసింది.. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే పూర్తి వార్తను చదవండి  మీకే తెలుస్తుంది.. 

వాళ్ళ ఇద్దరి పేర్లు అథిర , షాన్వాజ్. ఒకరి వయసు 28 , మరొకరి వయసు 30 సంవత్సరాలు. వాళ్ళు ఇద్దరు కొన్నాళ్లుగా సహజీవనం చేశారు.. తనతో సహజీవనం చేస్తున్న అమ్మాయి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన యువకుడు చివరికి ఆమెకు తనువును నిప్పంటించాడు. ఆ సోషల్ మీడియా పోస్ట్ విషయమై ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. చినికి చినికి గాలివానలా మారినట్టు చివరికి ఆమె ప్రాణాలు తీసేదాకా వచ్చింది. చివరికి ప్రాణాలు మంటతో మొదలై గాలిలోకలిసిపోయాయి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

కొల్లమ్‌లోని అంచల్‌కు చెందిన బాధితురాలు అథిర, షాన్‌వాజ్ లు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరికి మూడు నెలల చిన్నారి కూడా ఉంది. అథిర సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై షాన్‌వాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. కోపంతో ఊగిపోయిన షాన్‌వాజ్.. ఇంటిలో ఉన్న కిరోసిన్‌ను అథిర ఒంటిపై పోసి నిప్పంటించాడు. ఒంటికి నిప్పంటించిన తర్వాత అథిర పెద్దగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు చేరుకుని మంటలు ఆర్పారు. అనంతరం ఇద్దర్నీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో తీవ్రంగా గాయపడిన అథిర తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ ఘటనలో అథిర కాలిపోవడమే కాదు  షాన్‌వాజ్‌కు కూడా గాయాలు అయ్యాయి. చివరికి అతను కూడా ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘ఈ విషయం మీద బాధితురాలి తల్లి స్పందిస్తూ..  అథిర సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో గురించి షాన్‌వాజ్ వాగ్వాదానికి దిగాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది..ఈ ఘటనపై కేసు నమోదుచేసిన అంచల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది..