TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విద్యుత్ శాఖ అధికారి కార్యాలయంలో లాడెన్ ఫొటో

Published on: Thu Jun 2, 2022 6:05AM

ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజినీర్ ఎవరంటే అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ అంటున్నాడా విద్యుత్ అధికారి. నరరూపరాక్షసుడు,  వందల మంది మరణానికి కారణమైన అమెరికా ట్విన్ టవర్స్ పై దాడి సూత్రధాని అయిన ఒసామా బిన్ లాడెన్ న ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజినీర్ గా కీర్తిస్తే ఏకంగా అతడి ఫొటోనే తన కార్యాలయంలో పెట్టుకున్నాడు.

ఉత్తర ప్రదేశ్ కు చెందిన రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ అనే విద్యుత్ అధికారి. ఆయన యూపీ ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ దక్షిణాంచల్ విద్యుత్ విట్రాన్ నిగమ్ లిమిటెడ్ లో సబ్ డివిజనల్ ఆఫీసర్. రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ తన కార్యాలయంలో ఒసామా బిన్ లాడెన్ ఫొటో పెట్టుకున్నాడన్న సమాచారంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. లాడెన్ ఫొటో రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ కార్యాలయంలో పెట్టుకున్న మాట వాస్తవమని తేలడంతో అతనిపై కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

కార్యాలయంలో ఉన్న లాడెన్ ఫొటో కింద  గౌరవనీయుడు ఒసామా బిన్ లాడెన్ ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్ అయితే తాను చేసింది ఏ మాత్రం తప్పు కాదని రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ వాదిస్తున్నారు. ఎవరైనా ఎటువంటి ఫొటో అయినా పెట్టుకోవచ్చనీ, తన దృష్టిలో లాడెన్ ప్రపచంలోనే అత్యుత్తమ ఇంజనీర్ అనీ వాదిస్తున్నాడు.

తన వద్ద లాడెన్ ఫోటోలు ఇంకా ఉన్నాయని చెబుతున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా వెంటాడి వేటాడి మరీ ఖతం చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ లోని పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న  లాడెన్‌ను  అమెరికా సైనిక బలగాలు మట్టుపెట్టిన సంగతి తెలిసిందే.