లడ్డూ ‘సిట్’ దూకుడు!
Published on: Mon Sep 30, 2024 7:25PM

తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో దూకుడు పెంచింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీకి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యులు కొందరికి నోటీసులు పంపేందుకు సమాయత్తమౌతోంది. అలాగే తిరుమలలో ఈ రోజు విచారణ జరపనుంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళి కృష్ణను సీట్ పోలీస్ గెస్ట్ హౌస్ కు పిలిపించి విచారించింది. ఏఆర్ డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఎవరికి ప్రయోజనం ఉందనే దానిపై సిట్ మురళీకృష్ణను ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఇక మార్కెట్ విలువ కంటే తక్కువ ధరను కోడ్ చేసినప్పటికీ ఈ టెండర్ ని ఎందుకు టీటీడీ బోర్డు ఆమోదించిందో తెలపాలంటూ అప్పటి అధికారులు, బోర్డుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.


